Sunday, November 29, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్ఖేలో ఇండియా జూడో పోటీలకు కరీంనగర్ ఆతిథ్యం

ఖేలో ఇండియా జూడో పోటీలకు కరీంనగర్ ఆతిథ్యం

📰 Generate e-Paper Clip

  • జాతీయ స్థాయి పోటీలకు ఏర్పాట్లు
  •  క్రీడాకారులతో రెండు కిలోమీటర్ల పరుగు
  • పాల్గొన్న డీఆర్వో, డీవైఎస్‌ఓ
  • ప్రతిభ చాటాలని అధికారుల ఆకాంక్ష

శెనార్తి మీడియా,కరీంనగర్:

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో భాగంగా నిర్వహించనున్న జాతీయ స్థాయి జూడో పోటీలకు కరీంనగర్ జిల్లా వేదిక కానుంది. ఈ పోటీల నేపథ్యంలో క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు జిల్లా కేంద్రంలో రెండు కిలోమీటర్ల పరుగు కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి స్వామి, జిల్లా యువజన, క్రీడల అధికారి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా అమెచ్యూర్ జూడో అసోసియేషన్ కార్యదర్శి ఎస్. దామోదర్, జిల్లా కోచ్‌లు, జూడో క్రీడాకారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. తద్వారా కరీంనగర్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావాలని సూచించారు. యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఖేలో ఇండియా వంటి వేదికలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. జాతీయ స్థాయి జూడో పోటీల నిర్వహణకు కరీంనగర్ ఎంపిక కావడం జిల్లా క్రీడారంగానికి గర్వకారణమని తెలిపారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.