Sunday, November 29, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్రాష్ట్రస్థాయి పోటీలకు విజన్ హైస్కూల్ విద్యార్థుల ఎంపిక

రాష్ట్రస్థాయి పోటీలకు విజన్ హైస్కూల్ విద్యార్థుల ఎంపిక

📰 Generate e-Paper Clip

శెనార్తిమీడియా, కొత్తపల్లి :

ఎస్జీఎఫ్​ రాష్ట్రస్థాయి పోటీలకు కొత్తపల్లి మండలం రేకుర్తి విజన్ హైస్కూల్ విద్యార్థులు ఎంపికైనట్లు స్కూల్​ కరస్పాండెంట్​ సిరిపురం ప్రసాద్​ తెలిపారు. డిస్ట్రిక్ట్ ఆథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రీజియన్ స్పోర్ట్స్ స్కూల్ లో గురువారం జరిగిన 12వ తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్, జూనియర్ ఆథ్లెటిక్స్ పోటీల్లో విజన్ హైస్కూల్ విద్యార్థులు పాల్గొని వివిధ విభాగాలలో బంగారు , వెండి , కాంస్య పతకాలు సాధించినట్లు పేర్కొన్నారు. అండర్ -10 విభాగంలో లాంగ్ జంప్ లో బి.శివాన్స్ వెండి, ఆర్​.రితిక్ కాంస్య, అండర్ -12 విభాగం 80 మీటర్ల పరుగు పందెంలో జి.సాయితేజ బంగారు పతకం, లాంగ్ జంప్ లో బంగారు పతకం, కె.రిత్విక్ వెండి, అండర్- 14 విభాగం 80 మీటర్ల పరుగు పందెంలో  బి.శివ సాయి బంగారు, సీహెచ్​.వైష్ణవి 300 మీటర్ల పరుగు పందెంలో వెండి పతకం సాధించినట్లు చెప్పారు. వీరిలో ముగ్గురు విద్యార్థులు జి.సాయితేజ , బి.శివసాయి, కె. రిత్విక్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనందుకు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు ఈ నెల 30, డిసెంబర్​ 1న నిజామాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ సందవేణి వెంకట్​, ప్రిన్సిపల్,  వైస్ ప్రిన్సిపల్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.