శెనార్తి మీడియా, శంకరపట్నం:
మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) నమోదు ప్రక్రియను వంద శాతం పూర్తి చేసేలా బీఎల్‌ఏ–2లు సమన్వయంతో పనిచేయాలని బీజేపీ మండల సంయోజకుడు మేకల ప్రభాకర్ యాదవ్ పిలుపునిచ్చారు.
శంకరపట్నం మండలంలోని మొలంగూర్ పరిధిలో లక్ష్మీ ప్రసన్న గార్డెన్స్‌లో బీజేపీ మండల అధ్యక్షుడు ఎనుగుల అనిల్ ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్ మండల ప్రవాస్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మేకల ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ బూత్ స్థాయిలో కమిటీలు మరింత పటిష్టంగా పనిచేస్తూ ప్రతి అర్హుడైన ఓటరిని నమోదు చేసేలా కృషి చేయాలని సూచించారు.
అనంతరం మండలంలో ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియ పురోగతిపై పార్టీ నాయకులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో వంకాయగూడెం సర్పంచ్ వెన్నం మల్లేష్, దొంగల రాములు, జంగ జైపాల్, నిమ్మశెట్టి సంపత్, రాసమల శ్రీనివాస్, ఎల్కపెల్లి సంపత్, చెర్ల శ్రీనివాస్, బిజిలి సారయ్య, బోడ తిరుపతి, కనకం కుమార్, రాజిరెడ్డి, గూళ్ల రాజు, శ్రీనాథ్, ఆయా గ్రామాల బీఎల్‌ఏ–2లు, మండల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

