Thursday, August 27, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్ఫ్లైఓవర్‌పై ఆటో బోల్తా

ఫ్లైఓవర్‌పై ఆటో బోల్తా

📰 Generate e-Paper Clip

శెనార్తి మీడియా, శంకరపట్నం:

మండలంలోని తాడికల్ గ్రామం రాజీవ్ రహదారి నూతన బ్రిడ్జి ఫ్లైఓవర్‌పై బుధవారం ఆటో అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కరీంనగర్‌కు చెందిన బుక్య సునీత (37)కు తల, భుజానికి బలమైన గాయాలు కాగా, ఆమె భర్త బుక్య రాజ్‌కుమార్ (43) స్వల్పంగా గాయపడ్డారు.

వరంగల్‌లో బంధువుల శుభకార్యానికి వెళ్లి సొంత ఆటోలో కరీంనగర్‌కు తిరిగి వస్తుండగా తాడికల్ ఫ్లైఓవర్ వద్ద ఆటో అదుపుతప్పినట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది ఈఎంటీ గూడూరి సతీష్ రెడ్డి, పైలట్ మతి గోపికృష్ణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

క్షతగాత్రులకు అంబులెన్స్‌లో ప్రథమ చికిత్స అందించి కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.