శెనార్తి మీడియా, శంకరపట్నం:
ఉపసర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్‌కు కేశవపట్నం గ్రామంలో ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ముస్తాబాద్‌లో జరిగే వివాహ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా వెళ్తున్న కార్తీక్‌కు జిల్లా ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఆకుబత్తిని విజయ్ కుమార్ ఆధ్వర్యంలో స్వాగతం తెలిపారు.
ఈ సందర్భంగా కార్తీక్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించారు.
కార్యక్రమంలో ఉపసర్పంచులు మండల సుభాష్ రెడ్డి, చింతం రాజేశం, రాజశేఖర్, వెంగళ ప్రవీణ్ కుమార్, గొల్లిపల్లి కుమార్, ఆడెపు సుధాకర్, వార్డు సభ్యులు అన్నారపు సరోజన తిరుపతి, గొల్లిపల్లి శ్రీనివాస్, మ్యాకల వనిత సంపత్, కల్లేపల్లి పోచయ్య, ఎంహెచ్‌పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సముద్రాల సంపత్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

