నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేయాలి
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
శెనార్తిమీడియా, గంగాధర :
రైతులు తమ ధాన్యం విక్రయించడానికి దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు. గంగాధర మండలం హిమ్మత్ నగర్, కురిక్యాల, గంగాధర, లక్ష్మీదేవిపల్లిలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఇబ్బంది పడకుండా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. గన్నీ సంచులు, పరదాలు, తూకం యంత్రాలను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన రైతుల వివరాలను నమోదు చేసుకుని తేమ శాతం వచ్చిన వెంటనే వడ్లు కొనుగోలు చేయాలని, రైతు వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసి రైతుల ఖాతాలో ధాన్యం డబ్బులు జమయ్యేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, జిల్లా సహకార అధికారి రామాంజనేయచార్య, సింగిల్ విండో చైర్మన్లు వెలిచాల తిర్మల్ రావు, దూలం బాలాగౌడ్, తహసీల్దార్ అంబటి రజిత, ఎంపీడీవో దమ్మని రాము, ఏపీఎం కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంత్రి మహేందర్, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు చిరుత మంగ, మాజీ జెడ్పీటీసీ సత్తు కనకయ్య, డీసీసీ ఉపాధ్యక్షుడు పురుమల్ల మనోహర్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ముద్దం నగేష్, సర్పంచులు పడాల భాగ్యలక్ష్మి– రాజన్న, రామిడి రాజిరెడ్డి, బాసవేని శ్రీనివాస్, రేండ్ల శ్రీనివాస్, బీర్ల ఆనందం, ఆరె తేజశ్రీ– – రాజశేఖర్, మల్కాపురం రాజేశ్వరి– రాజేశం, కడారి రేణుక– కనకయ్య, చిందం ఆంజనేయులు, కోలెపాక కవిత– మల్లేశం, దీకొండ బాబలక్ష్మి– మధు, గుండవేని లావణ్య– తిరుపతి, గుడి రజని– ప్రవీణ్ రెడ్డి, రాచమల్ల రవి, నాయకులు రోమాల రమేశ్, సాగి అజయ్ రావు, రాచమల్ల భాస్కర్, గుజ్జుల బాపురెడ్డి, అత్తపురం తిరుపతి, గంగాధర ప్రవీణ్, కడారి కుమారస్వామి, అట్ల రాజిరెడ్డి పాల్గొన్నారు.


