Tuesday, November 10, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్కేశవపట్నం వాగులో ఇసుక అక్రమ రవాణా

కేశవపట్నం వాగులో ఇసుక అక్రమ రవాణా

📰 Generate e-Paper Clip

  •  అర్ధరాత్రి, తెల్లవారుజామున యథేచ్ఛగా తరలింపు

శెనార్తి మీడియా, శంకరపట్నం:

శంకరపట్నం మండలం కేశవపట్నం వాగులో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాగులో ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేసుకుని రాత్రి వేళల్లో, తెల్లవారుజామున అక్రమంగా ఇసుకను తరలిస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారని పేర్కొంటున్నారు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ సాగుతున్న ఈ అక్రమ రవాణాతో వాగు సహజ వనరులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత రెవెన్యూ, పోలీస్ అధికారులు తక్షణమే స్పందించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని, ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.