Saturday, November 21, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్సామాజిక సమస్యల నిర్మూలనకు కృషిచేయాలి

సామాజిక సమస్యల నిర్మూలనకు కృషిచేయాలి

📰 Generate e-Paper Clip

విద్యార్థులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యుల అవగాహన

శెనార్తిమీడియా, గంగాధర :

బాల్య వివాహాలు బాలల భవిష్యత్తును దెబ్బతీస్తాయని, మాదకద్రవ్యాల వినియోగం జీవితాలను నాశనం చేస్తుందని, ఈ రెండు సామాజిక సమస్యల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శివకుమార్ ఆదేశాల మేరకు న్యాయవాదులు చిట్టి చంద్రప్రకాష్ రెడ్డి, ఎ.కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో గంగాధర మండలం గర్శకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాల్య వివాహాల నిర్మూలన, మాదకద్రవ్యాల నివారణపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్య వివాహాల నిరోధక చట్టం-2006 ప్రకారం బాలికకు 18 ఏళ్లు, బాలుడికి 21 ఏళ్లు నిండకముందు వివాహాలు జరిపించడం చట్టపరమైన నేరమని, ఇందుకు కఠిన శిక్షలు ఉన్నాయని వివరించారు. మాదకద్రవ్యాల వినియోగంతో విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభ్యాసం, భవిష్యత్తు తీవ్రంగా ప్రభావితమవుతాయని, ఎన్‌డీపీఎస్ చట్టం-1985 ప్రకారం మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, తమ భవిష్యత్తును బాధ్యతాయుతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. బాల్య వివాహాల సమాచారం తెలిస్తే 1098 చైల్డ్ హెల్ప్​ లైన్, 181 మహిళా హెల్ప్​ లైన్, 15100 న్యాయ సహాయ హెల్ప్​ లైన్, 112 అత్యవసర సేవలకు సంప్రదించాలన్నారు. అనంతరం విద్యార్థులతో బాల్య వివాహాల నిర్మూలన, మాదకద్రవ్యాల నివారణపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో స్కూల్​ ఇంచార్జి హెచ్​ఎం ఎస్​.ఉమాదేవి, పారా లీగల్ వలంటీర్ ఇ.సుజాత, టీచర్స్​ టి.వెంకటరమణ, జె.బాలకిషన్, ఎండీ.సాబీర్, వి.లలితాదేవి, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.