Sunday, November 22, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్మహిళ అనుమానాస్పద మృతి

మహిళ అనుమానాస్పద మృతి

📰 Generate e-Paper Clip

12 రోజుల తర్వాత మృతదేహం వెలికితీత

శెనార్తిమీడియా, గంగాధర :

గంగాధర మండలం రంగారావుపల్లికి చెందిన దోమకొండ శంకరమ్మ అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా, ఆమె మృతదేహాన్ని పోలీసులు 12 రోజుల తర్వాత వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. శంకరమ్మ ఈ నెల 8వ తేదీ రాత్రి మృతిచెందింది. కుటుంబసభ్యులు మరుసటి రోజు అంత్యక్రియలు నిర్వహించారు. మృతురాలి చిన్నమ్మ శంకరమ్మ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ నవంబర్ 20న గంగాధర పోలీసులను ఆశ్రయించారు. స్పందించిన పోలీసులు ఖననం చేసిన మృతదేహాన్ని వెలికితీయించి తహసీల్దార్​ అంబటి రజిత సమక్షంలో పోస్టుమార్టం చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత శంకరమ్మ మృతికి గల కారణాలు తెలుస్తాయని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ పేర్కొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.