Sunday, November 22, 2026
📄 ePaper
Homeజనరల్ న్యూస్వితంతువును వదలని పంచాయతీ కార్యదర్శి

వితంతువును వదలని పంచాయతీ కార్యదర్శి

📰 Generate e-Paper Clip

  • పింఛన్ మంజూరుకు రూ.10 వేలు లంచం డిమాండ్
  • దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసినందుకు డబ్బులు డిమాండ్
  • లక్ష్మీపూర్ జీపీ కార్యదర్శిని అరెస్టు చేసిన ఏసీబీని అదికారులు
  • ఫిర్యాదుదారుడి వద్ద లంచం తీసుకుంటూ జీపీ సెక్రటరీ
  • కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్న అధికారులు

శెనార్తి మీడియా, కరీంనగర్:

లంచానికి మరిగిని ఆ అధికారి ఆఖరికి వితంతువును కూడా వదల్లేదు. వితంతు పింఛన్ మంజూరు చేయించేందుకు లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు చిక్కాడు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి లావుడ్యా చవన్ లాల్‌ను శుక్రవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ఫిర్యాదుదారుడి కోడలికి ‘తెలంగాణ చేయూత పింఛన్’ (వితంతు పింఛన్) మంజూరు చేయించే క్రమంలో అధికారిక సహాయం చేసినందుకు రూ.10 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. ఈ మేరకు ఫిర్యాదుదారుడి నివాసంలో లంచం తీసుకుంటుండగా అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

అధికారి నుంచి లంచం మొత్తాన్ని ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ విధులను దుర్వినియోగం చేసి అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి కరీంనగర్‌లోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు ఏసీబీ ప్రకటనలో పేర్కొంది. కేసు దర్యాప్తులో ఉంది.

ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. వాట్సాప్ నంబర్ 9440446106, ఫేస్‌బుక్ (తెలంగాణ ఏసీబీ), ఎక్స్ (గతంలో ట్విట్టర్) @Telangana ACB ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.