Thursday, October 8, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్ఎండిపోతున్న పంటలను కాపాడాలి

ఎండిపోతున్న పంటలను కాపాడాలి

📰 Generate e-Paper Clip

24 గంటల కరెంట్ ఇవ్వాలి
మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌డిమాండ్‌
గంగాధర చౌరస్తాలో బీఆర్‌ఎస్‌ఆధ్వర్యంలో ధర్నా
శెనార్తిమీడియా, గంగాధర :
రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌సరఫరా చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని డిమాండ్‌చేస్తూ బీఆర్‌ఎస్‌మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా గంగాధర చౌరస్తాలో బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. వరి పంట పొట్ట దశకు చేరుకున్న సమయంలో విద్యుత్‌సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. రైతులు కష్టపడి సాగుచేసిన పంటలకు నీరందించి కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో విద్యుత్‌కోతలు విధించడం సరికాదన్నారు. ఎన్నికలకు ముందు రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌అందిస్తామని కాంగ్రెస్‌హామీ ఇచ్చిందని, ప్రస్తుతం ఆ హామీ అమలుపై రైతుల్లో ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. రైతు భరోసా, రుణమాఫీ, పంటలకు బోనస్‌, ధాన్యం కొనుగోలు వంటి అంశాల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌చేశారు. గతంలో తెలంగాణలో విద్యుత్‌సరఫరా పరిస్థితులు ఎలా ఉండేవో, ప్రస్తుతం మళ్లీ అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. పంటలు ఎండిపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని, ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యుత్‌సరఫరాను మెరుగుపరచాలని కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే గ్రామాల వారీగా విద్యుత్‌సబ్‌స్టేషన్లను ముట్టడిస్తామని, కలెక్టర్‌కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొత్త జయపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ చిలుక రవీందర్, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, గంగాధర, బోయినపల్లి, మల్యాల, రామడుగు మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు మేచినేని నవీన్ రావు, కత్తెరపాక కొండయ్య, జనగాం శ్రీనివాస్, గంట్ల జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.