శెనార్తిమీడియా, కొత్తపల్లి :
ఎస్జీఎఫ్ అండర్–19 వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కొత్తపల్లి మండలం రేకుర్తి డ్రీమ్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి మూడు గోల్డ్ మెడల్స్, రెండు సిల్వర్ మెడల్స్ సాధించినట్లు డైరెక్టర్ అండ్ కరస్పాండెంట్ వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులను ప్రోత్సహిస్తూ, వారికి అవసరమైన శిక్షణ, సౌకర్యాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజేతలను అభినందించారు. విద్యార్థుల కృషి, క్రమశిక్షణ, పట్టుదలకు ఈ విజయమే నిదర్శనమని, భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలన్నారు. క్రీడా ఇన్‌చార్జి శ్రీకాంత్ పాల్గొన్నారు.

