Thursday, October 15, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్ఆపదలో భరోసా సీఎంఆర్​ఎఫ్​

ఆపదలో భరోసా సీఎంఆర్​ఎఫ్​

📰 Generate e-Paper Clip

111 మందిలబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

శెనార్తిమీడియా, కరీంనగర్​ :

అనారోగ్యం, ప్రమాదాల్లో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేద, మధ్యతరగతి ప్రజలకు సీఎం సహాయనిధి ఆపదలో భరోసా కల్పిస్తోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని  వివిధ గ్రామాలకు చెందిన 111 మంది లబ్ధిదారులకు రూ.31,08,700ల విలువైన ఆర్థికసాయం చెక్కులను గంగాధర ప్రజా కార్యాలయంలో బుధవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ  పంపిణీ చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల కంటే రెట్టింపు చెక్కులను కేవలం మూడేళ్లలోనే పంపిణీ చేసినట్లు తెలిపారు. సీఎంఆర్ఎఫ్ తో తమను ఆదుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ముద్దం నగేష్, సర్పంచులు వేముల భాస్కర్, రేండ్ల శ్రీనివాస్, చిందం ఆంజనేయులు, బీర్ల ఆనందం, రాచమల్ల రవి, బాసవేణి శ్రీనివాస్, దాసరి శంకరయ్య, ఈటవేణి శ్రీనివాస్, పడాల భాగ్యలక్ష్మి– రాజన్న, దానె అనసూయ– ఓదెలు, కడారి రేణుక– కనకయ్య, గంకిడి సంధ్య– చంద్రారెడ్డి, కవిత– మల్లేశం, దీకొండ బాబలక్ష్మి, నాయకులు పురుమల్ల మనోహర్, సాగి అజయ్ రావు, చిరుత మంగ, తోట సంధ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.