శెనార్తిమీడియా, గంగాధర :
గంగాధర మండలం రంగారావుపల్లి గ్రామపంచాయతీ సిబ్బందికి పాలకవర్గ సభ్యులు గురువారం దసరా కానుకలు అందజేశారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి సహకరిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, మరింత మెరుగైన సేవలు అందించాలని కోరారు. అనంతరం డ్రెస్లు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ దాసరి శంకరయ్య, ఉప సర్పంచ్ బహదూర్ రెడ్డి, కార్యదర్శి మౌనిక, వార్డు సభ్యులు పాల్గొన్నారు .

