Saturday, October 31, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్కేశవపట్నంలో పోలీసుల కార్డన్‌ అండ్‌ సెర్చ్‌

కేశవపట్నంలో పోలీసుల కార్డన్‌ అండ్‌ సెర్చ్‌

📰 Generate e-Paper Clip

  • 72 వాహనాలు సీజ్‌..
  • 40 మంది పోలీసులతో తనిఖీలు
  • కన్నాపూర్ లో సీసీ కెమెరాల ప్రారంభం

శెనార్తి మీడియా, శంకరపట్నం:

శంకరపట్నం మండలం కేశవపట్నం  గ్రామంలో హుజూరాబాద్ సబ్‌ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 40 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు రెండు ప్రత్యేక స్ట్రైకింగ్‌ బృందాలు పాల్గొన్నాయి.

గ్రామంలోని ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనుమానితులు, అపరిచిత వ్యక్తుల కదలికలతో పాటు అసాంఘిక కార్యకలాపాలపై ఆరా తీశారు. సరైన ధ్రువపత్రాలు లేని మొత్తం 72 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 65 ద్విచక్ర వాహనాలు, నాలుగు త్రిచక్ర వాహనాలు, మూడు నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయి.

ఈ సందర్భంగా హుజూరాబాద్ ఏసీపీ మాట్లాడుతూ గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించడంతో పాటు అక్రమ కార్యకలాపాలను అడ్డుకోవడం, నేరాలను నియంత్రించడమే కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రధాన ఉద్దేశమన్నారు. ఇలాంటి తనిఖీలతో ప్రజల్లో భద్రతాభావం పెరుగుతుందని, నేరాలకు పాల్పడే వారిలో పోలీసుల పట్ల భయం ఏర్పడుతుందని తెలిపారు.

ప్రజలు సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గంజాయి సహా ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని, కొత్తగా నిర్మించిన బైపాస్‌ రహదారిపై నిర్దేశిత మార్గాల్లోనే ప్రయాణించాలని కోరారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని సూచించారు.

గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా అసాంఘిక కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని ఏసీపీ ప్రజలను కోరారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.