- ఐదుగురు అరెస్ట్..
- బైకులు, సెల్ఫోన్లు, నగదు స్వాధీనం
శెనార్తి మీడియా, శంకరపట్నం:
కేశవపట్నంలోని ఓ ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ ఘటనలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు
నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ ఏసీపీ సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు ద్విచక్ర వాహనాలు, ఆరు సెల్ఫోన్లు, 11350 నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులతో పాటు స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి విచారణ కోసం కేశవపట్నం పోలీసులకు అప్పగించారు.
ఈ దాడిలో ఎస్సై శ్రీకాంత్, హెడ్ కానిస్టేబుళ్లు శ్రీనివాస్, సురేంద్ర పాల్ సింగ్, మల్లేష్, కానిస్టేబుల్ సాయి దీప్ పాల్గొన్నారు.

