Tuesday, November 17, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్‘కాంగ్రెస్’తోనే పేదలకు న్యాయం

‘కాంగ్రెస్’తోనే పేదలకు న్యాయం

📰 Generate e-Paper Clip

వెలిచాల సర్పంచ్​ వీర్ల నర్సింగారావు

శెనార్తిమీడియా, రామడుగు :

కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించేందుకు కృషి చేస్తోందని రామడుగు మండలం వెలిచాల సర్పంచ్​ వీర్ల నర్సింగారావు అన్నారు. సోమవారం గ్రామ పంచాయతీలో నిర్వహించిన కార్యక్రమంలో రేషన్​ స్మార్ట్​ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, సన్నబియ్యం పంపిణీతో పాటు నూతన పింఛన్ల మంజూరు వంటి పథకాలను అమలు చేస్తోందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందడంతో పాటు సామాజిక న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్​ ఎల్లమ్మల వసంత, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.