100వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్ష
సంఘీభావం తెలిపిన మైత్రి గ్రూప్స్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి
శెనార్తిమీడియా, గంగాధర :
తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని కోరుతూ నారాయణపూర్ గ్రామస్తులు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మైత్రి గ్రూప్స్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి సోమవారం సంఘీభావం తెలిపారు. నారాయణాపూర్ గ్రామస్తుల రిలే నిరాహార దీక్ష సోమవారం 100వ రోజుకు చేరింది. వందో రోజుకు చేరిన నేపథ్యంలో నారాయణపూర్ నుంచి గ్రామస్తులు, జయపాల్ రెడ్డి మధురానగర్ ఎక్స్ రోడ్ వరకు నల్ల బ్యాడ్జీలు, నోటికి నల్ల మాస్కులు ధరించి ర్యాలీగా తరలివచ్చి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు నారాయణపూర్ గ్రామస్తులను పట్టించుకోవడం లేదన్నారు. తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని ప్రశ్నించిన వారిపై కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తాను నారాయణపూర్ గ్రామస్తులకు పూర్తిస్థాయిలో అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

