Tuesday, November 17, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్రెండు బైక్‌లు ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు

రెండు బైక్‌లు ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు

📰 Generate e-Paper Clip

శెనార్తి మీడియా, శంకరపట్నం:
మండలంలోని తాడికల్ గ్రామ శివారులో బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

తాడికల్ గ్రామానికి చెందిన మేకల చంద్రమౌళి కేశవపట్నంలోని వైన్‌షాపులో పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని బైక్‌పై స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా మార్గమధ్యంలో ముందు వెళ్తున్న మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో చంద్రమౌళికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌తో పాటు పోలీసులకుసమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటన వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.