Wednesday, July 29, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్గోరింటాకు శుభానికి సంకేతం

గోరింటాకు శుభానికి సంకేతం

📰 Generate e-Paper Clip

శెనార్తి మీడియా, శంకరపట్నం: ప్రతి శుభకార్యంలో గోరింటాకు శుభానికి ప్రతీకగా నిలుస్తుందని మొలంగూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కంకణాల నీరజ తెలిపారు. మంగళవారం పాఠశాలలో నిర్వహించిన మెహందీ ఉత్సవంలో ఆమె పాల్గొని విద్యార్థులకు గోరింటాకు ప్రాముఖ్యత, ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకునే ఆచారం వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని వివరించారు. గోరింటాకు శరీరంలోని అధిక వేడిని తగ్గించడంలో తోడ్పడటంతో పాటు ఫంగస్, బ్యాక్టీరియా నుంచి రక్షణ కల్పిస్తుందని చెప్పారు. ప్రతి ఇంట్లో శుభకార్యాలకు ముందు మెహందీ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని గుర్తు చేశారు.

 

మెహందీ ఉత్సవంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం ఆనందంగా ఉందని నీరజ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.