శెనార్తి మీడియా, రామగుండం:
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేసి ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకురాలు సోమరపు లావణ్య పిలుపునిచ్చారు.
బీజేపీ చేపట్టిన మండల ప్రవాస్ కార్యక్రమంలో భాగంగా లక్ష్మీనగర్ మండలంలోని అశోకనగర్, అడ్డగుంటపల్లి, లక్ష్మీనగర్ ప్రాంతాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను ఆమె సందర్శించారు. రామగుండం ఎస్‌ఐఆర్ జాయింట్ కో-ఆర్డినేటర్ కోడూరి రమేష్, మండల అధ్యక్షురాలు ఊరగొండ అపర్ణ, బూత్ అధ్యక్షులతో కలిసి ఓటరు నమోదు, పేర్ల సవరణ ప్రక్రియను పరిశీలించారు. విధులు నిర్వహిస్తున్న బీఎల్‌వోలను అభినందిస్తూ, ఓటరు జాబితా సవరణను పారదర్శకంగా, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు.
ఈ సందర్భంగా సోమరపు లావణ్య మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి అర్హుడికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం విజయవంతం అయ్యేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మణికొండ శ్రీను, మాధవగోయిన రాకేష్, సుల్వా పద్మ, అరెగెల్ల శ్రవణ్, పాశం రాజు, కొమ్మ శ్రీనివాస్, కె. మురళి, జి. భాస్కర్, జనగామ సాగర్, మెరుగు శ్రీను, కొమ్మల స్వామి, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

