Saturday, August 8, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్వార్డు మెంబర్ల ఫోరం ఇన్‌చార్జిగా రమేష్ యాదవ్

వార్డు మెంబర్ల ఫోరం ఇన్‌చార్జిగా రమేష్ యాదవ్

📰 Generate e-Paper Clip

వార్డు మెంబర్ల ఫోరం ఇన్‌చార్జిగా రమేష్ యాదవ్

శెనార్తి మీడియా, శంకరపట్నం:

వార్డు మెంబర్ల ఫోరం మానకొండూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాకారపు రమేష్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి, జిల్లా ఇన్‌చార్జి బండారి భరత్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్భంగా తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి, జిల్లా ఇన్‌చార్జి బండారి భరత్‌కు రమేష్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. మానకొండూరు నియోజకవర్గంలోని వార్డ్ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

వార్డ్ సభ్యుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పనిచేస్తూ, ఫోరం బలోపేతానికి కట్టుబడి ఉంటానని బాకారపు రమేష్ యాదవ్ వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.