Friday, October 2, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్మానవత్వం మంట కలిసిన వేళ..

మానవత్వం మంట కలిసిన వేళ..

📰 Generate e-Paper Clip

  • పసికందు మృతదేహం లభ్యం

శెనార్తి మీడియా, శంకరపట్నం:

అప్పుడే లోకాన్ని చూసిన ఆ పసికందుకు.. బతికే అవకాశం కూడా దక్కలేదు. కన్నవారి ఆప్యాయతకు నోచుకోకుండానే మట్టిలో కలిసిపోయింది. శంకరపట్నం మండల కేంద్రంలోని కేశవపట్నం పాతవాడ మోరి పక్కన మంగళవారం రాత్రి గుంత తీసి పాతిపెట్టిన పసికందు మృతదేహం వెలుగుచూడటం స్థానికంగా కలకలం రేపింది.

సుమారు మూడు, నాలుగు రోజుల వయసున్న పసికందుగా, దాదాపు మూడు కిలోల బరువు ఉన్నట్లు వైద్యులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అప్పుడే పుట్టిన ఆ చిన్నారిని ఎవరు అక్కడికి తీసుకొచ్చారు? ఎందుకు పాతిపెట్టారు? సహజ మరణమా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే ప్రశ్నలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.

సమాచారం అందుకున్న ఏఎస్ఐ సంపత్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్, ఉప సర్పంచ్ ఆకు బత్తిని విజయకుమార్ కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పసికందు మృతదేహం వెలుగులోకి రావడంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

చిన్నారి ఎవరు, మృతదేహాన్ని అక్కడికి తీసుకొచ్చింది ఎవరు, ఏ పరిస్థితుల్లో పాతిపెట్టారనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది. పసికందు మృతదేహాన్ని హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.