శెనార్తిమీడియా, గంగాధర :
గంగాధర మండలం గట్టుభుత్కూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త బోయిని మునీందర్ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గురువారం పరామర్శించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మునీందర్ బుధవారం మృతిచెందాడు. కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ కంకణాల విజేందర్ రెడ్డి, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బొడ్డు మల్లేశం, వార్డు మెంబెర్స్, కార్యకర్తలు ఉన్నారు.

