Sunday, October 11, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్పూల పండుగకు వెలుగు కరువు

పూల పండుగకు వెలుగు కరువు

📰 Generate e-Paper Clip

  • తొలిరోజు చీకట్లోనే బతుకమ్మ వేడుకలు
  • కరీంపేట తొమ్మిదో వార్డులో మహిళల అసహనం

    శెనార్తి మీడియా, శంకరపట్నం:
    పూల పండుగకు వెలుగు కరువైంది. ఆడబిడ్డలు ఎంతో సంబురంగా జరుపుకునే బతుకమ్మ పండుగ తొలి రోజు నిశీధిలోనే ఆడుకోవాల్సి వచ్చింది. మండలంలోని కరీంపేట గ్రామం తొమ్మిదో వార్డులో బతుకమ్మ వేడుకలకు కనీస ఏర్పాట్లు చేయకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. తొలిరోజు వేడుకల్లో భాగంగా కాలనీ మహిళలు బస్టాండ్ వద్ద బతుకమ్మ ఆడేందుకు సిద్ధమయ్యారు.
    అయితే అక్కడ సరైన లైటింగ్ సౌకర్యం లేకపోవడంతో వీధి దీపాల వెలుతురులోనే మహిళలు వేడుకలు నిర్వహించుకోవాల్సి వచ్చింది. పండుగకు ముందస్తు ఏర్పాట్లు చేయడంలో పాలకవర్గ సభ్యులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు చీకట్లో బతుకమ్మ ఆడుతున్న వీడియోలను వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేస్తూ తమ అసంతృప్తిని తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.