Sunday, October 18, 2026
📄 ePaper
HomeCrimeద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్

ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్

📰 Generate e-Paper Clip

శెనార్తిమీడియా, గంగాధర :
గంగాధర మండలం మధురానగర్, రామడుగు మండలం వెలిచాలలో రాయల్ ఎన్‌ ఫీల్డ్ ద్విచక్ర వాహనాల దొంగను అరెస్టు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. టూ వీలర్ దొంగతనాల కేసు దర్యాప్తులో భాగంగా నిర్మల్ పట్టణంలోని రాంనగర్‌కు చెందిన యాసర్ అహ్మద్ (25)ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు తన స్నేహితులైన అక్బర్ ఖాన్, ఉమర్ ఖాన్‌లతో కలిసి వివిధ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించాడు. ఈ ముఠాకు చెందిన మిగతా ఇద్దరు నిందితులు ప్రస్తుతం ఆదిలాబాద్ జైలులో ఉన్నారు. ఈ కేసులకు సంబంధించిన దొంగిలించిన ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.