శెనార్తిమీడియా, కొత్తపల్లి :
కొత్తపల్లి మండలం రేకుర్తి, కొత్తపల్లి పట్టణంలోని ప్యారడైజ్, సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో శనివారం బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్కూల్ చైర్మన్ ఫాతిమారెడ్డి హాజరై నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు, జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. విద్యార్థులు ప్రత్యేకమైన నృత్య, నాటక, సంగీత ప్రదర్శనలతో పాటు ఉపన్యాసాలు ఇచ్చారు. పలువురు చిన్నారులు నెహ్రూ వేషధారణతో సందడి చేశారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ మాట్లాడుతూ బాలల దినోత్సవం ప్రతి చిన్నారి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజని, పిల్లలే దేశ భవిష్యత్తు అని అన్నారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర రంగాల్లో ఆసక్తి కనబరుస్తూ తనలోని ప్రతిభను వెలికితీయాలని సూచించారు.


