Friday, November 13, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్ఉద్యోగాల పేరిట మోసగించిన మహిళకు రెండేళ్ల జైలు శిక్ష

ఉద్యోగాల పేరిట మోసగించిన మహిళకు రెండేళ్ల జైలు శిక్ష

📰 Generate e-Paper Clip

శెనార్తి మీడియా, శంకరపట్నం:

ప్రభుత్వ ఆసుపత్రిలో కాంపౌండర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానని ముగ్గురి నుంచి డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిన మహిళకు హుజూరాబాద్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు రెండేళ్ల సాధారణ జైలు శిక్ష విధించింది. రాచపల్లి గ్రామానికి చెందిన బొబ్బిలి గంగ అలియాస్ గామనిక ఒక్కొక్కరి నుంచి రూ.1.20 లక్షల చొప్పున గడ్డి కిరణ్, గడ్డి సంతోష్, గడ్డి మహేష్‌ల వద్ద మొత్తం రూ.3.60 లక్షలు తీసుకుని మోసం చేసింది. ఈ ఘటనపై కేశవపట్నం పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 63/2016, ఐపీసీ 420 సెక్షన్‌ కింద కేసు నమోదైంది.

అప్పటి దర్యాప్తు అధికారి ఎల్. శ్రీను విచారణ పూర్తి చేసి న్యాయస్థానంలో చార్జిషీట్‌ దాఖలు చేశారు. కేసు విచారణ అనంతరం అసిస్టెంట్ సెషన్స్ జడ్జి పి.బి. కిరణ్ నిందితురాలికి రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.3 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. ప్రభుత్వ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గ్రేడ్‌-2 కె. ఝాన్సీ వాదనలు వినిపించారు.

కేసు విచారణకు సహకరించిన కోర్టు డ్యూటీ ఆఫీసర్ కె. సురేష్‌తోపాటు సంబంధిత పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని, ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచించారు. మోసానికి గురైతే వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ప్రస్తుత ఎస్‌ఐ ఎన్. నరేష్ రెడ్డి కోరారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.