Wednesday, November 18, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్విద్యార్థులు క్రీడల్లో సత్తాచాటాలి

విద్యార్థులు క్రీడల్లో సత్తాచాటాలి

📰 Generate e-Paper Clip

వెలిచాల సర్పంచ్​ వీర్ల నర్సింగారావు

స్పోర్ట్స్​ యూనిఫామ్స్​ అందజేత

శెనార్తిమీడియా, రామడుగు :

విద్యార్థులు క్రీడల్లో సత్తాచాటాలని రామడుగు మండలం వెలిచాల సర్పంచ్​ వీర్ల నర్సింగారావు అన్నారు. రామడుగు మండలం వెలిచాల జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాలకు చెందిన 68 మంది విద్యార్థులకు మంగళవారం స్పోర్ట్​ యూనిఫామ్స్​ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ సత్తా చాటడం వారి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి ఎంతో అవసరమని, క్రీడలతో శారీరక దృఢత్వమే కాకుండా మానసిక ఉల్లాసం, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ అలవడతాయన్నారు. నిత్యం ఆటలు ఆడటం వల్ల శరీరం చురుకుగా ఉంటుందని, చదువు ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచుతుందన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని తిరిగి ప్రయత్నించే ఆత్మవిశ్వాసం విద్యార్థులకు వస్తుందన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్​ ఎల్లమ్మల వసంత, కార్యదర్శి, వార్డు మెంబర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.