Wednesday, November 18, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్ఉప సర్పంచుల హక్కులు, గౌరవం కోసం గళమెత్తాలి

ఉప సర్పంచుల హక్కులు, గౌరవం కోసం గళమెత్తాలి

📰 Generate e-Paper Clip

  • ఈ నెల 27న కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ
  • ఉప సర్పంచులు, వార్డు సభ్యులు అధిక సంఖ్యలో తరలిరావాలి

శెనార్తి మీడియా, శంకరపట్నం:
గ్రామాల అభివృద్ధిలో ఉప సర్పంచులు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నందున వారికి తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలని కరీంనగర్ జిల్లా ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, కేశవపట్నం ఉప సర్పంచ్ ఆకు బత్తిని విజయ్ కుమార్ కోరారు. గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనుల శిలాఫలకాలపై ఉప సర్పంచుల పేర్లను సైతం చేర్చాలని సూచించారు.

ఉప సర్పంచుల సమస్యలు, హక్కులు, గౌరవానికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఈ నెల 27న కరీంనగర్‌లో ఫోరం ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఉప సర్పంచులు, వార్డు సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.

శంకరపట్నం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన సమావేశంలో ఉప సర్పంచులు ఆకు బత్తిని విజయకుమార్, చింతం రాజేశం, సుభాష్ రెడ్డి, కృష్ణారెడ్డి, గుర్రం శ్రీనివాస్ గౌడ్, కుమార్, రాజిరెడ్డి, గుర్రం తిరుపతి, వార్డు సభ్యులు పంజాల సంపత్, డిల్లీ రాములు, బొజ్జ సుధాకర్, శ్రీకాంత్, శ్రీనివాస్, రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.