ఇంటింటికీ వెళ్లి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
బొట్టుపెట్టి ఆహ్వానించిన బీఆర్ఎస్ మహిళా నాయకులు
శెనార్తిమీడియా, గంగాధర :
దీక్షా దివస్ స్ఫూర్తి సభను విజయవంతం చేద్దామని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. గంగాధర మండలం కొండన్నపల్లిలో మంగళవారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మహిళా నాయకులు నవంబర్ 29న నిర్వహించనున్న దీక్షా దివస్ స్ఫూర్తి సభను విజయవంతం చేయాలని గ్రామంలోని ఆడపడుచులకు బొట్టు పెట్టి సభకు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అనే నినాదంతో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష, తీసుకున్న నిర్ణయం ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని పేర్కొన్నారు. ఆ చారిత్రక పోరాటాన్ని ప్రజలకు, నేటి తరానికి వివరించడమే దీక్షా దివస్ సభ ముఖ్య ఉద్దేశమన్నారు. యావత్ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

