Saturday, August 29, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్మక్త వద్ద రోడ్డు ప్రమాదం

మక్త వద్ద రోడ్డు ప్రమాదం

📰 Generate e-Paper Clip

శెనార్తి మీడియా, శంకరపట్నం: పండగ వేళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మక్త గ్రామ శివారులో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.

కన్నాపూర్‌కు చెందిన కూరపాటి అరవింద్, ముత్తారం గ్రామానికి చెందిన మంద వంశీకృష్ణ ద్విచక్ర వాహనంపై కేశవపట్నం వెళ్తుండగా.. మామిడాలపల్లికి చెందిన వ్యక్తి కారు అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినట్లు తెలిపారు.

ఈ ప్రమాదంలో అరవింద్‌కు తీవ్ర గాయాలు కాగా, వంశీకృష్ణకు గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు, 108కు సమాచారం అందించడంతో సిబ్బంది ప్రథమ చికిత్స అందించి కరీంనగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ వివరాలు నమోదు చేసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.