Wednesday, September 2, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్మెడికల్‌ బోర్డుల సంఖ్య పెంచాలి

మెడికల్‌ బోర్డుల సంఖ్య పెంచాలి

📰 Generate e-Paper Clip

  • మెడికల్‌ ఇన్వాలిడేషన్‌లో జాప్యంపై టీబీజీకేఎస్‌ నిరసన
  • అర్హులైన కార్మికుల కేసులు త్వరగా పరిష్కరించాలని డిమాండ్‌
  • నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల ఆందోళన
  • గని మేనేజర్‌కు మెమోరాండం అందజేత

    శెనార్తి మీడియా, గోదావరిఖని:

    సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీబీజీకేఎస్‌ యూనియన్‌ పోరుబాట పట్టింది. ఇటీవల నిర్వహించిన మెడికల్‌ బోర్డులో కేవలం 10 శాతం మంది కార్మికులకు మాత్రమే మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ కల్పించడాన్ని నిరసిస్తూ మంగళవారం కృషి భవన్‌ వద్ద ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో ఆందోళన చేపట్టారు.

    బోర్డుల సంఖ్య పెంచాలి
    మెడికల్‌ ఇన్వాలిడేషన్‌కు అర్హత ఉన్నప్పటికీ తగిన సంఖ్యలో మెడికల్‌ బోర్డులు నిర్వహించకపోవడంతో పలువురు కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యూనియన్‌ నాయకులు తెలిపారు. నెలకు రెండు నుంచి మూడు మెడికల్‌ బోర్డులు నిర్వహించి, అర్హత కలిగిన అధిక సంఖ్యలో కార్మికులకు ఇన్వాలిడేషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు.

    పెండింగ్‌ కేసులు పరిష్కరించాలి
    ఈ మేరకు యూనియన్‌ నాయకులు గని మేనేజర్‌కు మెమోరాండం అందజేశారు. కార్మికుల సమస్యను యాజమాన్యం సానుకూలంగా పరిశీలించి, మెడికల్‌ బోర్డుల సంఖ్యను పెంచాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించి అర్హులైన కార్మికులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

    ఫిట్‌ సెక్రటరీ మామిడి తిరుపతి అధ్యక్షతన జరిగిన నిరసనలో టీబీజీకేఎస్‌ బ్రాంచ్‌ సెక్రటరీ హరిప్రసాద్‌, సెంట్రల్‌ కమిటీ నాయకులు అబ్బు శ్రీనివాస్‌రెడ్డి, కూర తిరుపతి, రిలే బి-షిఫ్ట్‌ ఇన్‌చార్జి అక్కెనపల్లి సురేష్‌, కనకరాజు, కన్నె రవి, రమేష్‌, బియ్యాని శీను, మహిపతి, ముఖేష్‌, దామెర శ్రీనివాస్‌, పూర్ణచందర్‌, వంశీనాథ్‌, మంగళవారం సతీష్‌, రామ్మూర్తి, నరసింహులు, ముక్కెర మహేందర్‌, రాజేందర్‌ తదితరులతో పాటు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.