శెనార్తిమీడియా, కొత్తపల్లి :
కొత్తపల్లి పట్టణంలోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ముందస్తు బతుకమ్మ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు, టీచర్స్ రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పారు. స్కూల్ చైర్మన్ ఫాతిమారెడ్డి మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో మన సంప్రదాయాల పట్ల గౌరవం, ఐక్యతా భావం, ప్రకృతి పట్ల ప్రేమ పెంపొందుతాయని, మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.

