శెనార్తిమీడియా, రామడుగు :
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతుపల్లికి చెందిన 45 రోజుల చిన్నారి కరీంగనర్ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావుపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. పెగడపల్లి మండలం ఐతుపల్లికి చెందిన బొమ్మగోని కిషన్ తన కుమార్తెకు జ్వరం రావడంతో తన భార్య కవితను తీసుకుని కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు వచ్చారు. చికిత్స చేయించుకుని బైక్ పై ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో గోపాల్ రావుపేట వద్ద కవిత చున్నీ బైక్ చక్రంలో చుట్టుకుని తల్లీకూతుళ్లు కిందపడ్డారు. ఈ ఘటనలో చిన్నారికి తీవ్రగాయాలపై మృతిచెందింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.

