- ఇద్దరికి గాయాలు
- 108లో ఆస్పత్రికి తరలింపు
శెనార్తి మీడియా, శంకరపట్నం(తిమ్మాపూర్):
మార్గమధ్యలో కోతులు అడ్డురావడంతో అదుపుతప్పిన ద్విచక్రవాహనం ప్రమాదానికి గురై తాత, మనవడు గాయపడ్డారు. ఈ ఘటన తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది.
పోలంపల్లి గ్రామానికి చెందిన చిప్ప బత్తుల పాపయ్య (80) తన మనవడు అనిల్ (30)తో కలిసి బ్యాంకు పని నిమిత్తం మానకొండూరుకు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మార్గమధ్యలో మల్లాపూర్ శివారులో ఒక్కసారిగా కోతులు అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పాపయ్య తలకు, ఎడమ చేతి మణికట్టు వద్ద తీవ్ర గాయాలయ్యాయి. అనిల్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఈఎంటీ గూడూరి సతీష్ రెడ్డి, పైలట్ ఆర్సీ రెడ్డి క్షతగాత్రులకు అంబులెన్స్‌లో ప్రథమ చికిత్స అందించి కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

