Friday, November 13, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్వాగేశ్వరిలో జేఎన్‌టీయూహెచ్ యూనివర్సిటీ స్థాయి క్రీడా ఎంపికలు

వాగేశ్వరిలో జేఎన్‌టీయూహెచ్ యూనివర్సిటీ స్థాయి క్రీడా ఎంపికలు

📰 Generate e-Paper Clip

  • 150 మంది క్రీడాకారుల ప్రతిభకు పరీక్ష.. నాలుగు విభాగాల్లో పోటీలు
  • క్రీడలు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి
  • కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్

శెనార్తి మీడియా, తిమ్మాపూర్:
తిమ్మాపూర్‌లోని వాగేశ్వరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్‌టీయూహెచ్) యూనివర్సిటీ స్థాయి క్రీడా ఎంపికలు విజయవంతంగా ముగిశాయి. 2026 సంవత్సరానికి పురుషులు, మహిళల విభాగాల్లో నిర్వహించిన ఈ ఎంపికల్లో సుమారు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

జేఎన్‌టీయూ హైదరాబాద్, కొండగట్టు, మంథని, సిరిసిల్ల క్యాంపస్‌లతో పాటు వివిధ అనుబంధ కళాశాలలకు చెందిన క్రీడాకారులు వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, బెస్ట్ ఫిజిక్, చెస్ పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. క్రీడా నైపుణ్యం, ప్రమాణాల ఆధారంగా యూనివర్సిటీ జట్లకు క్రీడాకారులను ఎంపిక చేశారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, తిమ్మాపూర్ సీఐ అనిల్ కుమార్, గౌరవ అతిథులుగా జేఎన్‌టీయూహెచ్ స్పోర్ట్స్ కౌన్సిల్ కార్యదర్శి డాక్టర్ ఎన్.ఎస్. దిలీప్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో క్రీడలు కీలకమని పేర్కొన్నారు. శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, పట్టుదలను క్రీడలు పెంపొందిస్తాయని తెలిపారు. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు.

కళాశాల జనరల్ సెక్రటరీ డాక్టర్ జి. శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ డాక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. రామకృష్ణ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. వాగేశ్వరి విద్యాసంస్థల సభ్యులు విశ్వనాథ్ వినోద్, సి.హెచ్. ప్రకాష్ రెడ్డి, వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సి.హెచ్. శ్రీనివాస్, వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొని క్రీడాకారులను అభినందించారు.

యూనివర్సిటీ స్థాయి క్రీడా ఎంపికలకు ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని కళాశాల యాజమాన్యం పేర్కొంది. కార్యక్రమ నిర్వహణకు సహకరించిన జేఎన్‌టీయూహెచ్ స్పోర్ట్స్ కౌన్సిల్, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఫిజికల్ డైరెక్టర్లు, రిఫరీలు, సాంకేతిక అధికారులు, అధ్యాపకులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపింది.

కార్యక్రమ సమన్వయకర్తలుగా కళాశాల విభాగాధిపతి వంగ శ్రీధర్, ఫిజికల్ డైరెక్టర్ ఎస్. దామోదర్ వ్యవహరించారు. పోటీల నిర్వహణలో తెలంగాణ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ హనుమంత్ రాజు, పెద్దపల్లి జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి రాజు, పవర్ లిఫ్టింగ్ నేషనల్ రిఫరీ శారద, కరీంనగర్ జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్. దామోదర్, జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి కె. అనూప్, ఫిజికల్ డైరెక్టర్లు మోహన్, ఎన్. శ్రీకాంత్, ఎ. శ్రీలత రిఫరీలు, సాంకేతిక అధికారులుగా సేవలందించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.