శెనార్తిమీడియా, కొత్తపల్లి :
జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు కొత్తపల్లి మండలం రేకుర్తి శాన్వి జూనియర్ కాలేజీ విద్యార్థిని కట్కూరి తేజాని ఎంపికైనట్లు కాలేజీ చైర్మన్ ఎర్రంశెట్టి మునీందర్ తెలిపారు. ఈ నెల 18 నుంచి చండీగడ్ లో జరిగే ఎస్జీఎఫ్ అండర్– 19 సాఫ్ట్ బాల్ జాతీయ క్రీడలకు తెలంగాణ తరఫున ఆడుతుందని ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి బన్సీలాల్ పేర్కొన్నారు. కళాశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో విద్యార్థిని కళాశాల చైర్మన్ ఎర్రంశెట్టి మునిందర్, ఎస్జీఎఫ్ సెక్రటరీ బన్సీలాల్ అభినందించారు. విద్యార్థిని మరింత కష్టపడి జాతీయస్థాయిలో మరిన్ని పథకాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్స్ మోహన్, రత్నాకర్, కోచ్ లు నవ్య, కొప్పుల గంగాధర్, లక్ష్మణరావు, లెక్చరర్స్ పాల్గొన్నారు.

