Friday, November 13, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలి

హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలి

📰 Generate e-Paper Clip

శెనార్తి మీడియా, కరీంనగర్‌:

ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులకు తగిన గుర్తింపు, గౌరవం, అధికారాలు కల్పించాలని రాష్ట్ర ఉపసర్పంచ్‌ల ఫోరం నాయకులు డిమాండ్‌ చేశారు. హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. డిసెంబర్‌ 27న కరీంనగర్‌ సర్కస్‌ గ్రౌండ్‌లో రాష్ట్రస్థాయి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
సభ విజయవంతం చేయాలని కోరుతూ కరీంనగర్‌లోని సంగీత కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. జిల్లా ఫోరం అధ్యక్షుడు ఆకుబత్తిని విజయ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి దుస్స కుమార్‌, ఉపాధ్యక్షుడు నవీన్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్వప్న, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కమలాకర్‌రెడ్డి, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు స్వామి, మహిళా విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సౌమ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.