శెనార్తి మీడియా, శంకరపట్నం:
మండలంలోని తాడికల్ గ్రామ శివారులో బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
తాడికల్ గ్రామానికి చెందిన మేకల చంద్రమౌళి కేశవపట్నంలోని వైన్‌షాపులో పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని బైక్‌పై స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా మార్గమధ్యంలో ముందు వెళ్తున్న మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో చంద్రమౌళికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌తో పాటు పోలీసులకుసమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటన వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.

