Tuesday, November 24, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్దీక్షా దివస్ స్ఫూర్తి సభను విజయవంతం చేద్దాం

దీక్షా దివస్ స్ఫూర్తి సభను విజయవంతం చేద్దాం

📰 Generate e-Paper Clip

ఇంటింటికీ వెళ్లి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

బొట్టుపెట్టి ఆహ్వానించిన బీఆర్ఎస్ మహిళా నాయకులు

శెనార్తిమీడియా, గంగాధర :

దీక్షా దివస్ స్ఫూర్తి సభను విజయవంతం చేద్దామని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. గంగాధర మండలం కొండన్నపల్లిలో మంగళవారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మహిళా నాయకులు నవంబర్ 29న నిర్వహించనున్న దీక్షా దివస్ స్ఫూర్తి సభను విజయవంతం చేయాలని గ్రామంలోని ఆడపడుచులకు బొట్టు పెట్టి సభకు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అనే నినాదంతో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష, తీసుకున్న నిర్ణయం ఫలితంగానే  తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని పేర్కొన్నారు. ఆ చారిత్రక పోరాటాన్ని ప్రజలకు, నేటి తరానికి వివరించడమే దీక్షా దివస్ సభ ముఖ్య ఉద్దేశమన్నారు. యావత్ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి పోవాలి,  కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.