Thursday, November 19, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం అందించాలి

📰 Generate e-Paper Clip

  • మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
  • ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం
  • రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, చేయూత పింఛన్ల పంపిణీ
    శెనార్తి మీడియా, శంకరపట్నం:

    ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఆకలితో ఇబ్బంది పడకుండా అల్పాహార పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. బుధవారం శంకరపట్నం మండలం కేశవపట్నం మోడల్ స్కూల్‌లో ఆయన బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించారు.

    ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పోషక విలువలున్న రుచికరమైన ఆహారం అందించడంపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాల అమలులో నిర్లక్ష్యం లేకుండా వంట సిబ్బంది నాణ్యమైన భోజనం సిద్ధం చేయాలని ఆదేశించారు.

    అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు చేయూత పింఛన్లు, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరా క్యాంటీన్ల ఏర్పాటు, ఆర్టీసీకి కొత్త బస్సుల కొనుగోలు వంటి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అర్హులైన పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నట్లు వివరించారు. ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతోపాటు చేయూత పింఛన్ల ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

    ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్, స్పెషల్ ఆఫీసర్ అనిల్ కుమార్, తహసీల్దార్ సురేఖ, ఎంపీడీవో అనిత, ఎంఈవో లక్ష్మీనారాయణ, పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

    Pension Papers
    పింఛన్ మంజూరు పత్రాలు అందజేస్తున్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.