Thursday, October 15, 2026
📄 ePaper
HomeCrimeఅలరించిన బతుకమ్మ వేడుకలు 

అలరించిన బతుకమ్మ వేడుకలు 

📰 Generate e-Paper Clip

 

శెనార్తిమీడియా, కరీంనగర్:

కొత్తపల్లి పట్టణంలోని సెయింట్ జార్జ్, ప్యారడైజ్ విద్యా సంస్థల్లో మంగళవారం నిర్వహించిన బతుకమ్మ వేడుకలు అలరించాయి. ఈ వేడుకల్లో తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటారు. విద్యాసంస్థల చైర్మన్ డా.పి.ఫాతిమారెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని, ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజిస్తూ మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగకు విశిష్టమైన ప్రాధాన్యత ఉందని తెలిపారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు మన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి పట్ల అవగాహన పెరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్య అతిథులుగా కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ అధ్యక్షుడు డా.పొన్నం రవిచంద్ర, 18వ డివిజన్ కార్పొరేటర్ వాసాల రమేశ్, 17వ డివిజన్ కార్పొరేటర్ వేముల కవిత చంద్రశేఖర్, కులసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ ఆనంద్, సైబర్ క్రైమ్ ఎస్సై జి.అనూష, మాజీ కార్పొరేటర్ రాచకొండ చక్రధర్ రావు హాజరై బతుకమ్మ పండుగ విశిష్టతను కొనియాడుతూ, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. విజేతలకు బహుమతులు అందజేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.