- అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కైలాస్ యాదవ్
- కరీంనగర్ జిల్లా జూడో సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక
Judo Association: తెలంగాణలో క్రీడా రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని, అందులో భాగంగా జూడో క్రీడను గ్రామీణ స్థాయికి విస్తరింపజేసేందుకు విశేషంగా కృషి చేస్తానని తెలంగాణ జూడో సంఘం అధ్యక్షుడు కైలాస్ యాదవ్ చెప్పారు.
ఆదివారం కరీంనగర్‌లోని హోటల్ తారక్‌లో జరిగిన కరీంనగర్ జిల్లా జూడో సంఘం(karimnagar judo association) సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రాష్ర్టంలో జూడో క్రీడాకారులకు గుర్తింపు లభించిందన్నారు. భవిష్యత్తులో ఒలింపిక్ స్థాయిలో బరిలో దిగే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
జూడో యుద్ధ క్రీడ అని, యువత ఇందులో శిక్షణ తీసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా శిక్షణా ప్రమాణాలను మెరుగు పరిచేందుకు త్వరలోనే ప్రత్యేక అకాడమీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
జూడో క్రీడలో తెలంగాణ క్రీడాకారులు దేశ స్థాయిలో పతకాలు సాధిస్తూ రాష్ట్ర కీర్తిని పెంచుతున్నారని వారు తెలిపారు.
జిల్లా ప్రధాన కార్యదర్శిగా దామోదర్
కరీంనగర్ జిల్లా జూడో సంఘం కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా సాదవేని వినయ్, ప్రధాన కార్యదర్శిగా దామోదర్, ట్రెజరర్‌గా ఎండీ మన్నాన్, ఉపాధ్యక్షులుగా గొర్రె శ్రీనివాస్ వాసు, క్రాంతి, బత్తిని జ్యోతి, జాయింట్ సెక్రటరీలుగా శ్రీకాంత్ చంద్రబాబు, రవీంద్ర చారి, నిశాంత్ గౌడ్, శ్రీధర్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా పోలగాని శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రీలత, కార్యవర్గ సభ్యులుగా డాక్టర్ తేజస్విని, శ్రీలత, సాయి అరుణ్, సుధాకర్, షాబీర్ పాషా బాధ్యతలు చేపట్టగా, సలహాదారులుగా ఎం. మునీందర్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జూడో సంఘం సంయుక్త కార్యదర్శి సంతోష్, టెక్నికల్ చైర్మన్ రాము పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, కరీంనగర్
