- సేవే మానవ ధర్మం అనే భావన ఏర్పడుతుంది…
- ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్…
- రాష్ట్ర స్కౌట్స్ లీడర్ ట్రైనర్ షరీఫ్
SCOUTS AND GUIDES : స్కౌట్స్ అండ్ గైడ్స్ తో విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు అలవడుతాయని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ (SCOUTS AND GUIDES) తెలంగాణ రాష్ట్ర లీడర్ ట్రైనర్ ( LT) షరీఫ్ (SHAREEF) అన్నారు. శని వారం మంచిర్యాల పట్టణంలోని కాలేజ్ రోడ్ లో గల ఐఐటీ చుక్కా రామయ్య హై స్కూల్ (IIT CHUKKA RAMAIAH HIGH SCHOOL) లో నిర్వహించిన భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇన్వెస్టిట్యూర్ వేడుకల (INVESTITURE CEREMONY) కు ముఖ్య అతిథిగా హాజరై స్కౌట్స్ అసిస్టెంట్ లీడర్ ట్రైనర్ (ALT) రవికిరణ్ చారి (RAVI KIRAN CHARI), మంచిర్యాల, గోదావరి ఖని చుక్కా రామయ్య విద్యా సంస్థల చైర్మన్ కొమ్ము దుర్గా ప్రసాద్ (KOMMU DURGA PRASADH) తో కలిసి ఆయన మాట్లాడారు. స్కౌట్స్ ద్వారా విద్యార్థులలో సేవా భావం పెంపొందడంతో పాటు వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందన్నారు.

- సమయపాలన, కర్తవ్యం తెలిసొస్తుంది…
స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా విద్యార్థులలో సమయపాలన, క్రమశిక్షణ, కర్తవ్యం తెలుస్తుందని స్కౌట్స్ రాష్ట్ర ఎల్టీ (LT) షరీఫ్ పేర్కొన్నారు. అంతే కాకుండా సహచరులకు, సమాజానికి సేవ చేయాలనే మనస్తత్వం ఏర్పడుతుందన్నారు. బృందానికి నాయకత్వం వహిస్తూ ముందుండి నడిపించడం, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వంటి నాయకత్వ లక్షణాలు అభివృద్ది చెందుతాయన్నారు. దేశంలోని అన్ని మతాల వారితో కలిసి పని చేయడం వల్ల కుల, మత బేధాలు లేకుండా అందరికి సహాయం అందించాలనే సహకార భావం నేర్చుకుంటారని, స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాలు (SCOUT AND GUIDE CAMPS), అవుట్ డోర్ యాక్టివిటీ (OUTDOUR ACTIVITIES) ల ద్వారా ప్రకృతి, పర్యావరణం పట్ల మమకారం పెరిగి పర్యావరణాన్ని కాపాడేందుకు తనవంతు కర్తవ్యంగా ముందుకు సాగుతారని, అంతే కాకుండా వివిధ కార్యకలాపాలు, పోటీల ద్వారా దైర్యం, నమ్మకం పెరుగుతుందని, ఆపద సమయంలో సహాయం చేయడం, దేశభక్తి, బాధ్యతలు తెలుస్తాయన్నారు.

- సేవే మానవ ధర్మం అనే భావన ఏర్పడుతుంది…
విద్యార్థుల్లో సేవే మానవ ధర్మం అనే భావనను పెంపొందించేందుకు స్కౌట్స్ అండ్ గైడ్స్ దోహదపడుతాయని మంచిర్యాల, గోదావరి ఖని ఐఐటీ చుక్కా రామయ్య విద్యా సంస్థల చైర్మన్ (CHAIRMAN) కొమ్ము దుర్గా ప్రసాద్ (KOMMU DURGA PRASADH) అన్నారు. విద్యార్థులు చిన్న వయస్సు నుంచే దేశానికి సేవ చేసేందుకు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. విద్యార్థులు ఇంటి వద్ద, మీరున్న ప్రాంతంలో పలువురికి సేవలందించాలని, క్రమేణా ఈ సేవా భావం మరింత పెరుగుతుందన్నారు. మీరు క్షేత్ర స్థాయిలో అందించే సేవలు రాను రాను మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అవసరం మేరకు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలనే భావన ఏర్పడుతుందని, ఈ సేవలతోనే మున్ముందు గవర్నర్, రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకునే అవకాశం కలుగుతుందన్నారు.

- ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్…
సెంట్రల్ గవర్నమెంటు ఉద్యోగాల (Central Govt. Jobs) లో కూడా ఈ సర్టిఫికెట్లతో రిజర్వేషన్ (Reservation) లభిస్తుందన్నారు. స్కౌటింగ్ ద్వారా సమాజానికి సేవ చేసే ఆత్మను పెంపొందించుకోవాలని, ఇది కేవలం శారీరక శిక్షణ కాదని, మానసిక బలం కలిగించే ఉద్యమం అని అందరు గ్రహించాలన్నారు. అనంతరం విద్యార్థులతో స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు (DANCES), సాంస్కృతిక ప్రదర్శన (CULTURAL ACTIVITIES) లు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తిరుపతి (THIRUPATHI), స్కౌట్స్ మాస్టర్, లేడీ మాస్టర్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :
