Police Commoration Day
Police Commoration Day

Police Commoration Day: పోలీసుల త్యాగాలు స్పూర్తిదాయకం

  • రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా

Police Commoration Day: శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణత్యాగాలు త్యాగం, సేవకు ప్రతీకలు పోలీసులు.. శాంతిభద్రతల పరిరక్షణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు వెళ్లే యోధులు.. విధినిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకమని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని (ఫ్లాగ్ డే)ను ఘనంగా నిర్వహించారు. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు దేశంలో విధి నిర్వహణలో మరణించిన 191 మంది పోలీస్ అమరవీరుల పేర్లను అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ చదివి వినిపించారు.

Police Commoration Day
Police Commoration Day

సీపీ అంబర్ కిషోర్ తో పాటు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్, ఎన్టీపీసీ , ఆర్ఎఫ్‌సీఎల్ అధికారులు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, వివిధ విభాగాల ఎస్ఐలు, పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు, సిబ్బంది పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం ఆర్ఐ మల్లేశం సారథ్యంలో సాయుధ పోలీసులు శోక్ శ్రస్త్ చేసి మరణించిన పోలీసు అమరవీరులకు పోలీసు అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.

Police Commoration Day
Police Commoration Day

ఈ సందర్భంగా సీపీ మాట్లాడారు. ప్రజల కోసం తమ ప్రాణాలను అర్పించిన పోలీసులు మహనుభావులని, పోలీసు అమరవీరుల చూపిన మార్గదర్శకాన్ని అనుసరిస్తూ, ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడాలన్నారు. ప్రజల్లో మంచి పేరు రావాలంటే చిత్తశుద్ధి, నితీ, నీజాయితీతో పనిచేయాల్సి ఉంటుందన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలను మరువలేమని, వారు ఎల్లప్పుడు మన గుండెల్లోనే ఉంటారని, వారు మన మధ్య లేకున్నా మనం వారిని స్మరిస్తూనే ఉంటామని, అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలను కాపాడుకోవల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వారికి ఎలాంటి సమస్య వున్న వారికి పోలీస్ విభాగం తరుపున పూర్తి సహకారం అందజేస్తామని తెలిపారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ పోలీస్ అండగా ఉంటుందని ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువచ్చినట్లైతే సంబందించిన ప్రభుత్వ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Police Commoration Day
Police Commoration Day

కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏవో శ్రీనివాస్, కమిషనరేట్ పరిధిలోని వివిధ విభాగాల పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

-శెనార్తి మీడియా, గోదావరిఖని/మంచిర్యాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *