- ముప్పు పొంచి ఉన్నా అధికారుల పట్టదా?
- పటాకుల దుకాణాల అనుమతుల మంజూరులో నిబంధనలు గాలికి
- అధికారుల మౌనంపై అనుమానాలు
Patakulu: దీపావళి సందడికి మంచిర్యాల పట్టణం సిద్ధమవుతున్నా, ఆ వెలుగుల వెనుక అగ్ని ముప్పు దాగి ఉంది. పట్టణంలో ఏర్పాటు చేసిన పటాకుల దుకాణాలు చట్టపరమైన నియమాలను ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి. అధికారుల కళ్లముందే ఈ అక్రమాలు కొనసాగుతున్నా, చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం కొనసాగుతోంది.
అనుమతుల మంజూరులో అవినీతి ఆరోపణలు
ప్రతి సంవత్సరం పటాకుల షాపులకు అనుమతులు ఇవ్వడంలో ఓ ప్రైవేట్ వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడనే ఆరోప ణలు ఉన్నాయి. ఫైర్, మున్సిపల్, పోలీస్, రెవెన్యూ శాఖలలో అనుమతుల పేరుతో లావాదేవీలు జరుగుతున్నాయన్న అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఏర్పా టు చేసుకున్న వారు మళ్లీ అనుమతి పొం దాలంటే ఒక్కో దుకాణానికి రూ.30 వేల నుంచి రూ. 40 వరకు వసూలు చేస్తు న్న ట్లు వ్యాపారులు చెబుతున్నారు. కొత్తగా షాపులకు అనుమతి రావాలంటే రూ. 40 వేల నుంచి రూ. 45 వేల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల సహకారం లేకుండా ఇది సాధ్య మా అనే ప్రశ్న స్థానికుల్లో వినిపిస్తోంది.
జనావాసాల మధ్యే షాపులు
పటాకుల షాపులు జనసాంద్రత తక్కువ ప్రాంతాల్లో ఉండాలని నిబంధన ఉన్నా, మంచిర్యాలలో మాత్రం నివాస ప్రాంతాల మధ్యే ఏర్పాటయ్యాయి. ఒక్క దారిలోనే ప్రవేశం, నిష్క్రమణ ఉండడంతో ప్రమాదం సంభవిస్తే తీవ్ర అనర్థం తప్పదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భద్రతా చర్యలు గాలికొదిలి
ప్రతి షాపు వద్ద 200 లీటర్ల నీరు, ఫైరిం జన్ తిరగగలిగే స్థలం తప్పనిసరి అయినా, వాస్తవ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఖాళీ బకెట్లు, గుట్టలుగా పేలుడు పదార్థాలు, దుకాణాల మధ్య దూరం లేకపోవడం ముప్పును పెంచుతున్నాయి. తాత్కాలిక షాపుల్లో 100 కిలోల వరకు మాత్రమే నిల్వ ఉండాలని నిబంధన ఉన్నా, కొన్ని చోట్ల టన్నుల కొద్దీ పటాకులు నిల్వ చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
హాస్పిటల్ పక్కనే మార్కెట్
పటాకుల మార్కెట్‌కు సమీపంలోనే మా తా శిశు ఆసుపత్రి ఉంది. అక్కడ అత్యవసర రోగులను తరలించే మార్గం కూడా పటా కుల షాపులు, పార్కింగ్ కారణంగా బ్లాక్ అవుతోంది. రోగులకు, సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రెండు మీటర్ల దూరం ఉంటేచాలు..
అగ్నిమాపకశాఖ అధికారి సత్య నారా యణ మాట్లాడుతూ, “మంచిర్యాలలో 22 షాపులకు మాత్రమే అనుమతులు ఇచ్చాం. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎగ్జిబి షన్ ఆనుకొని దుకాణాలు ఏర్పాటు చేశా రని ‘శెనార్తి మీడియా’ ప్రతినిధి ప్రశ్నిం చగా, జనావాసాలకు రెండు మీటర్ల దూరం ఉంటే అనుమతులు ఇస్తామని అగ్నిమాపక శాఖ అధికారి చెబుతున్నారు. అధికారుల తీరుపై ప్రజల్లో అసహనం పెరుగుతోంది.
ప్రజల ప్రశ్నలకు సమాధానాలేవి?
జనావాసాల మధ్య పేలుడు పదార్థాల నిల్వలు, భద్రతా లోపాలు మంచిర్యాలకు అగ్నిముప్పుగా మారుతున్నాయి. “ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది?” అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పటాకుల వ్యాపారా ల వెనుక నడుస్తున్న ఈ ‘అవినీతి రాకెట్’ పై అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.
తహసీల్ నుంచి అనుమతులు లేవు
పటాకుల దుకాణాల అనుమతులపై నస్పూర్ తహసీల్దార్‌కు ‘శెనార్తి మీడి యా’ ప్రతినిధి ఫోన్ చేయగా పటాకుల దుకాణాలకు ఎలాంటి అనుమతులు తహసీల్దార్ కార్యాలయం నుంచి ఇవ్వ లేదని స్పష్టం చేశారు. తాను మంచి ర్యాల కార్పొరేషన్ కమిషనర్ సంపత్‌కు లెటర్ కూడా పంపినట్లు తెలిపారు. ఈ విషయమై మంచిర్యాల కమిషనర్‌కు ఫోన్ చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల
