Bird Festival : పక్షులు పర్యావరణానికి ఎంతో మేలు చేసే జీవరాశులని, వాటి సంరక్షణపై సమ గ్ర అధ్యయనం జరగాలని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (కంపా) డాక్టర్ సువర్ణ పేర్కొన్నారు. అట వీ శాఖ, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (WWF), నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మంచిర్యాలలో నిర్వహించిన బర్డ్స్ ఫెస్టివల్ ఆదివారం అట్టహాసంగా ముగిసింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యా లయ సమావేశ మందిరంలో జరిగిన ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ సువర్ణ మాట్లాడుతూ… పక్షులు ఖండాలు దాటి వలస వెళ్లే జీవరా శులని, వాటిని కాపాడుకోవడం అత్యవ సరమని తెలిపారు. పెరుగుతున్న పర్యా వరణ మార్పుల కారణంగా కొన్ని జాతుల పక్షులు వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తోందని, వాటి సంరక్షణకు ప్రత్యేక చర్య లు తీసుకోవాలని సూచించారు. విద్యా ర్థుల్లో పక్షులపై ఆసక్తిని పెంచేందుకు పాఠ శాల స్థాయిలోనే అవగాహన కార్యక్ర మాలు నిర్వహించాలని సూచించారు.
201 పక్షి జాతుల గుర్తింపు..
మంచిర్యాల జిల్లా అటవీ అధికారి శివ ఆశిష్ సింగ్ మాట్లాడుతూ… కవ్వాల్ టైగర్ రిజర్వ్, గోదావరి పరివాహక ప్రాం తాల్లో వేలాది పక్షులు సంచరిస్తున్నా యన్నారు. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ సహ కారంతో జన్నారం అటవీ డివిజన్‌లో గత రెండేళ్లుగా నిర్వహించిన పరిశీలనలో 201 జాతుల పక్షులను గుర్తించినట్లు వెల్ల డించారు. అటవీ సిబ్బంది తమ పరిధి లోని పక్షుల గమనాలను ఎప్పటికప్పుడు పరిశీలించి రికార్డు చేసుకోవాలని సూచించారు.
రాబందుల సంరక్షణతో జనాభా పెరుగుతోంది
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ అధికారి నీరజ్ టిబ్రేవాల్ మాట్లాడుతూ, కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో అరుదైన రాబందుల సంరక్షణ చర్యల వల్ల వాటి జనాభా పెరుగుతోందని తెలిపారు. నేషన ల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్స్ శాస్త్ర వేత్త మహేష్ శంకరన్ మాట్లాడుతూ, పక్షు ల జనాభా తగ్గితే బయోడైవర్సిటీ దెబ్బతిం టుందని, వాటి రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
11 పక్షి జాతులు అంతరించిపోతున్నాయి
వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అధికారి బండి రాజశేఖర్ మాట్లాడుతూ, జన్నారం అటవీ డివిజన్‌లో నిర్వహించిన అధ్యయనంలో 11 పక్షి జాతులు అంతరించి పోతున్నాయని వెల్లడించారు. 57 జాతుల పక్షులు అటవీ ప్రాంతాల్లోనే సంచరిస్తుం డగా, 99 జాతుల పక్షులు కీటకాలు తినే విగా, 16 జాతుల పక్షులు కేవలం పండ్ల ను ఆహారంగా తీసుకునేవిగా గుర్తించి నట్లు తెలిపారు.
పక్షుల పరిరక్షణకు అవగాహన కార్యక్రమాలు..
తమిళనాడుకు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ రాబిన్ విజయన్ మాట్లాడుతూ.. విద్యా ర్థుల్లో పక్షులపై అవగాహన పెంచేందుకు ప్రాజెక్ట్ వర్క్‌లు ఏర్పాటు చేయాలని సూ చించారు. బీఎన్‌హెచ్‌ఎస్ శాస్త్రవేత్త డాక్టర్ సాథియా సెల్వం మాట్లాడుతూ, ముంబై నగరంలో ఆరో తరగతి నుంచే విద్యార్థు లు పక్షులపై ప్రత్యేక రికార్డులు నిర్వహిస్తు న్నారని, ఇక్కడ కూడా బర్డ్స్ ఎకో క్లబ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ బర్డ్స్ ఫెస్టివల్ సందర్భంగా పక్షుల సంరక్ష ణలో విశేష సేవలందిస్తున్న వివిధ స్వచ్ఛం ద సంస్థల సభ్యులకు అటవీ శాఖ ప్రిన్సి పల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ సువర్ణ, కవ్వాల్ టైగర్ రిజర్వ్ చీఫ్ కన్జ ర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శాంతా రాములు కలిసి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్ర మంలో ఆదిలాబాద్ జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ కుమార్ పాటిల్, మంచిర్యాల ఫారెస్ట్ డివిజనల్ అధికారి సర్వేశ్వరరావు, శాస్త్రవేత్తలు డాక్టర్ శాంతారామ్, డాక్టర్ బిక్షం గుజ్జ, డాక్టర్ సాథియా సెల్వం, సంజీవ్ మీనన్, ఫారెస్ట్ రేంజ్ అధికారు లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్వచ్ఛం ద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
శెనార్తి మీడియా, మంచిర్యాల
