DRUNK AND DRIVE
బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షిస్తున్న ఎస్ఐ ఉపేందర్ రావు

DRUNK AND DRIVE : మద్యం తాగి వాహనం నడిపితే చర్యలు తప్పవు

  • సీసీసీ నస్పూర్ ఎస్ఐ ఉపేందర్ రావు

DRUNK AND DRIVE : మద్యం తాగి వాహనం నడిపితే శాఖాపరమైన చర్యలు తప్పవని సీసీసీ నస్పూర్ (CCC NASPUR) ఎస్ఐ (SI) ఉపేందర్ రావు (UPENDER RAO) హెచ్చరించారు. శుక్ర వారం రాత్రి శిర్కే (SHIRKE) సెంటర్ లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ (DRUNK AND DRIVE) కార్యక్రమంలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని బ్రీత్ ఎనలైజర్ (BREATH ANALYSER) సహాయంతో పరీక్షించారు. అంతే కాకుండా వాహనాల పేపర్ల (RC) ను, డ్రైవింగ్ లైసెన్సు (DRIVING LICENCE) లను పరిశీలించారు. మద్యం తాగిన వారి, సరైన ధ్రువ పత్రాలు లేని వాహనాలను పోలీస్ స్టేషన్ (POLICE STATION) కు తరలించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ (SI) ఉపేందర్ రావు (UPENDER RAO) మాట్లాడుతూ ప్రతీ వాహనానికి ధ్రువీకరణ పత్రాలు, ఇన్సూరెన్స్ (INSURANCE) తో పాటు వాహన చోదకుడికి డ్రైవింగ్ లైసన్స్ (DRIVING LICENCE) కలిగి ఉండాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ (HELMET) ధరించి వాహనం నడుపాలన్నారు. మద్యం సేవించి వాహనం నడుపరాదని, అలాంటి వారికి శాఖా పరంగా తప్పకుండా శిక్ష పడుతుందని హెచ్చరించారు. ఈ తనిఖీలలో పోలీసులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

– శెనార్తి మీడియా, మంచిర్యాల :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *