- ఎల్‌సీ కావాలంటే పర్సనల్ నంబర్ నుంచి కాల్ చెయ్…
- మహిళా పంచాయతీ కార్యదర్శి పట్ల ఓ లైన్ మెన్ అత్యుత్సాహం…
- విద్యుత్ అధికారులకు బాధితురాలి ఫిర్యాదు…
LINEMEN HARASSED WOMEN PANCHAYAT OFFICER : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం దేవులవాడ సబ్ స్టేషన్ పరిధిలోని లైన్‌మెన్ ఆగడాలు మితిమీరుతున్నాయి.. ఇప్పటి దాకా ఆ లైన్ మెన్ (LINEMEN) మీటర్ లేని ఇండ్లు, షాపులను టార్గెట్ చేస్తున్నాడనే ఆరోపణలుండగా.., మరో విస్తుపోయే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది… గ్రామాలలో ఎల్ సీ (LC) కోసం ఓ మహిళా పంచాయతీ కార్యదర్శి (PANCHAYAT SECRETERY) జీపీ (GRAM PANCHAYAT) సిబ్బంది మొబైల్ నుంచి సదరు లైన్ మెన్ కు కాల్ చేయగా, పర్సనల్ నంబర్ నుంచి ఫోన్ చేయాలంటున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి…
- పర్సనల్ నెంబర్ నుంచి కాల్ చేస్తేనే ఎల్ సీ…
కోటపల్లి మండలంలోని రాంపూర్ గ్రామ పంచాయతీ మహిళా కార్యదర్శి ఎల్ సీ కోసం ఇటీవల జీపీ సిబ్బందితో లైన్ మెన్ రామకృష్ణ (RAMA KRISHNA) కు కాల్ చేయించింది. అయితే అక్కడ ఓ మహిళా కార్యదర్శి ఉందని తెలియడంతో మీ మేడంతో కాల్ చేయించాలని, లేకుంటే ఎల్ సీ ఇవ్వమని ఖరాఖండిగా చెప్పేశాడు. తీరా సదరు మహిళా పంచాయతీ కార్యదర్శి అదే .జీపీ సిబ్బంది ఫోన్ నుంచి కాల్ చేయగా, మీ పర్సనల్ నంబర్ నుంచి కాల్ చేయాలని పట్టుబట్టాడు. గ్రామ పంచాయతీ పని కోసమే కదా అని సదరు మహిళా కార్యదర్శి ఆ లైన్ మెన్ రామకృష్ణకు కాల్ చేయగా, టాపిక్ డైవర్ట్ చేస్తూ ఆమె వ్యక్తిగత విషయాల గురించి అడిగినట్లు తెలిసింది. మహిళా కార్యదర్శికి తరచూ కాల్ చేసి అనవసర విషయాల గురించి మాట్లాడుతున్నాడని, ఓ లైన్ మైన్ మహిళా కార్యదర్శితో ఇలా వ్యవహరించడం ఎంత వరకు సమంజసమో సదరు విద్యుత్ శాఖ అధికారులకే తెలియాలి.
- విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు…
లైన్ మెన్ రామకృష్ణ మీద విద్యుత్ శాఖ మంచిర్యాల డీఈ (DE) కి ఫిర్యాదు రాసి ఫోన్ చేయగా కోటపల్లి ఏఈ (AE) వెంకటేశ్వర్లు (VENKATESHWARLU) తన కింది సిబ్బందితో ఫిర్యాదును తీసుకెళ్లిన ఏఈ ఆ ఫిర్యాదును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకపోగా రెండు రోజుల తర్వాత మీరే ఫిర్యాదు చేయాలని ఉచిత సలహా ఇచ్చారు. దీనితో సదరు సెక్రటరీ డీఈ ఖైసర్ (KHAISAR) కు వాట్సఫ్ ద్వారా తన ఫిర్యాదును పంపించింది. వారమైనా స్పందించకపోవడంతో చేసేదేమి లేక బుధ వారం మంచిర్యాల ఎస్ఈ కార్యాలయానికి ఫిర్యాదు చేసేందుకు రాగా ఉన్నతాధికారులు అందుబాటులోలేకపోవడంతో కార్యాలయంలో అందజేసి వెళ్లినట్లు సమాచారం.
- డీఈ సారు తీరే వేరు…
ఇందులో మరో జిమ్మిక్కు ఉంది. డీఈ ఖైసర్ కి వాట్సఫ్ లో ఫిర్యాదు చేసి ఫోన్ లో తనకు జరిగిన అన్యాయం చెబుతుంటే సదరు అధికారి మాటలు మరోలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. మేము వాడే మొబైల్ నెంబర్ వ్యక్తిగతమైందని చెబుతున్నా.., ”మీరు చేసిన ఫోన్ నెంబర్ ప్రభుత్వం ఇచ్చిందా, నెలకు మేయింటనెన్స్ ఎంత ఇస్తరు, మూడు వందలో, ఐదు వందలో ఇస్తరు కదా..” అంటూ వెటకారంగా మాట్లాడినట్లు సమాచారం. ఇక చేసేదేమి లేక మంచిర్యాల విద్యుత్ భవన్ బాట పట్టినట్లు తెలిసింది. ఏదీ ఏమైనా మహిళా అధికారితో కింది నుంచి మొదలు పై వరకు అలా మాట్లాడుతుంటే ఒక మహిళా అధికారిణి తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్థితి. మరో విషయమేమంటే ఎస్ ఈ కార్యాలయంలో సదరు మహిళ ఫిర్యాదు చేసిన తర్వాత 24/7 బిజీగా ఉండే మన డీఈ సారుకు వాట్సఫ్ (WHATS UP)లో చేసిన ఫిర్యాదు గుర్తుకు వచ్చినట్లుంది. బుధ వారం సాయంత్రం ‘ఓకే’ (OK) అని రిప్లై (REPLY) ఇచ్చిండంటే సారుకు విధుల పట్ల ఎంత గురుతర బాధ్యత ఉందో అర్థమవుతుంది.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :
